వారం మొత్తం ఆఫీసులో ఇంటర్నెట్ తో ఏమి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ??? ఒక్కోసారి ఈ రోజు చాలా బాగా గడిపానన్న సంతృప్తి ఇంకో సారి...ఏమి చెయ్యలేదే అన్న నిరుత్సాహం వీటిమధ్య కొట్టుమిట్టాడుతుంటే తలుక్కుమంటూ తానున్నానని వస్తుందో ఓ ఆదివారం. ఎన్నెన్నో ప్రణాళికలు...ఎన్నో కోరికలు...!!! ఆలస్యంగా లేవటం breakfast skip చేసి ఏకంగా భోజనం ఆ తరువాత ఈనాడు ఆదివారం తిరిగేయ్యటం. ఇంతలోనే మళ్లీ రేపటి ఆలోచన ...ఏమి కూర చెయ్యాలో చూసుకొమ్మని బుర్రని జోరీగలా తొలుస్తున్న ఆలోచన అవ్వన్నీ చేసేసరికి వచ్చే అనుకోని అతిధులు...ఇవన్ని ఎలా చేసామో కూడా తెలినీకండా వచేస్తుంది సాయంత్రం.
అలసి సొలసి ఉన్న మనసుని మైమరపిస్తూ...
No comments:
Post a Comment